accidentHome Page SliderNationalNews Alert

ఐటీ ఉద్యోగుల బస్‌కు అగ్నిప్రమాదం..4గురు మృతి

పుణెలోని హింజెవాడీ ఐటీ పార్క్ వద్ద ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సు తగలబడడం సంచలనం కలిగించింది. హఠాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. వెనుక డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. 10 మంది గాయపడ్డారు. నాణ్యత లేని బస్సును వినియోగిస్తున్నారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.