Home Page SliderInternational

యుద్ధం వేళ స్వదేశానికి తిరిగి వస్తున్న ఇజ్రాయెల్ దేశస్థులు

Share with

ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలోఇప్పటికే వందలమంది ఇజ్రాయెల్ సైనికులతోపాటు,పౌరులు మృత్యువాత పడ్డారు.అయితే మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల దాడుల్ని బలంగానే తిప్పి కొడుతుంది. కాగా ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై విదేశాల్లో ఉన్న ఆ దేశస్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న  ఇజ్రాయెల్ దేశస్థులు తమ సొంతగడ్డపై హమాస్ దాడులను ప్రతిఘటించేందుకు తమ వంతు సాయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు ఇజ్రాయెల్ తిరిగి వచ్చి మిలిటరీలో చేరడమో లేక సహాయక చర్యలు చేపట్టడమో చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే కొందరు ఇజ్రాయెల్ బయలు దేరారు.అయితే అక్కడ యుద్ధం జరుగుతున్న వీరంతా దేశం మీద ప్రేమతో ఇజ్రాయెల్‌కు తిరిగి వస్తున్నారు.ఇది చూసిన వారంతా ఇదే కదా దేశ భక్తి అంటే అని ఇజ్రాయెల్ ప్రజలను మెచ్చుకుంటున్నారు.