జియో యూజర్లకు ఐపీఎల్ గిఫ్ట్..
జియో యూజర్లకు జియోహాట్‌స్టార్ ఐపీఎల్ గిఫ్ట్‌ను ప్రకటించింది. జియో యూజర్లు రూ.299 గానీ, అంతకంటే ఎక్కువ ప్లాన్ కానీ రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఇది క్రికెట్ అభిమానులకు శుభవార్తే. త్వరలో జరగబోతున్న ఇండియన్ ప్రీమియం లీగ్ 2025ను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. జియోహాట్‌స్టార్ విలీనంతో ఈ మ్యాచ్‌లు ఉచితంగా చూసే వీలు లేకపోయింది. దీనికోసం కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. దీనితో జియో దీనిని వ్యాపార అవకాశంగా మార్చుకుంది. ఎంపిక చేసిన ప్లాన్లపై 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చని ప్రకటించింది. దీనిద్వారా మొబైల్, టీవీల్లో కూడా సేవలు పొందవచ్చని, దీనితో పాటు 50 రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా పొందవచ్చని జియో వెల్లడించింది. ఈ ఆఫర్ మార్చి 17 నుండి 31 వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.