ఈ నెల 25న ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
తెలంగాణ: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల ముల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదలవుతాయి.