NationalNewsNews Alert

పార్లమెంట్ ఆవరణలో ఎంపీల దీక్ష

Share with

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయ్. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు.ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై రాజ్యసభలో సస్పెన్షన్ విధించారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద  దీక్ష చేపట్టారు. ఉదయం నుండి కొనసాగిస్తున్న దీక్షలో టీఆర్ఎస్‌తో పాటు విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.

తమపై విధించిన అప్రజాస్వామిక సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్‌తో పాటు ఉభయసభల్లో జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు. సస్పెన్షన్‌కు గురైన విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నిరసన కొనసాగిస్తామని… చీకటి పడిన సరే దీక్షను ఆపేది లేదని ఎంపీలు స్పష్టం చేశారు.