ఆ రాయబారికి భారత్ సమన్లు
భారత్‌పై అనవసర వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడుతోంది కెనడా. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్‌పై లేని పోని వ్యాఖ్యలు చేస్తోంది కెనడా. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేస్తోంది. కెనడాలోని ఖలిస్తాని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవాలని, రాయబారులను హోం మంత్రి అమిత్ షా ఆదేశించారంటూ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్, కెనడా రాయబారిని పిలిపించి ఈ మేరకు నోటీసులు అందజేసింది. కెనడా డిప్యూటీ మినిష్టర్ డేవిడ్ మారిసన్ కేంద్ర హోం మంత్రిపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. వీటిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అని ఈ సమన్లలో పేర్కొన్నారు.