భారత్ అంటే అంత చిన్నచూపా..బిల్‌గేట్స్‌పై నెటిజన్లు మండిపాటు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారత్‌ను చిన్నచూపు చూస్తున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ భారత్ గొప్పతనాన్ని కొనియాడే బిల్‌గేట్స్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో భారతదేశ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. ఇటీవల రీడ్ హాఫ్‌మన్‌తో పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్ పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ కొత్త విషయాలు పరిశోధన విషయంలో భారత్ ప్రయోగశాలగా పనికి వస్తుందని పేర్కొన్నారు. పైగా గత 20 ఏళ్లలోనే భారత్ ఆరోగ్యం, ఆహారం, విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించిందని వ్యాఖ్యానించారు. దీనితో కొందరు నెటిజన్లు భారత్‌ను ప్రయోగశాలతో పోల్చడాన్ని తప్పుబట్టారు. బిల్‌గేట్స్ భారత్‌ను ఉద్దరిస్తున్నట్లు నటిస్తూ, భారత ప్రజలను లేబొరేటరీలో ఉండే శాంపుల్స్ అనుకుంటున్నారని విమర్శించారు.