పిచ్చి రాతలు రాస్తే తొడకలు తీస్తా.. సీఎం సీరియస్..
ముఖ్యమంత్రిగా చెప్తున్న ఇప్పటి నుంచి ఎవడైన పిచ్చి రాతలు రాస్తే ఒక్కొక్కడి తొడకలు తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తున్న జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. నాకు తిక్క రేగి మా పిల్లలకు చెప్తే రోడ్లపై పరిస్థితులు వేరే ఉంటాయి. మౌనంగా ఉన్నాం కదా అని చేతగాని తనం అనుకుంటే అది మీ ఖర్మ. ఇంట్లో ఆడవాళ్ల జోలికి పోతే ఎక్కువ రోజులు నేను చూస్తూ ఊరుకొను. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు హద్దు దాటుతున్నారు. దాటకుండా చూసుకో దాటితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.