HealthHome Page SliderInternationalNews Alert

గులాబీలా మెరిసిపోయే చర్మం కావాలంటే…

అందమైన, మృదువైన గులాబీలాంటి మెరిసిపోయే చర్మం కావాలంటే గులాబీలతోనే చికిత్స చేయమంటున్నారు సౌందర్య నిపుణులు. గులాబీరేకుల పేస్టుకి ఫేస్ క్రీం కొద్దిగా కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మం తేమగా మారుతుంది. అలాగే పెదాల పైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తద్వారా గులాబీల్లాంటి అధరాల్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ కాంతికి గులాబీ పూరేకల్ని చిక్కటి పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్ అప్లై చేసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. రెండు చెంచాల గంధం పొడి, పావు కప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకలు తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ అప్లై చేసుకొని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకోవడంతో పాటు నవయవ్వనంగానూ మెరిసిపోవచ్చు