‘పాపులారిటీ ఉంటే ఇష్టమొచ్చినట్లు వాగుతారా?’..సుప్రీంకోర్టు ఆగ్రహం
కుటుంబ వ్యవస్థపై, తల్లిదండ్రులపై అశ్లీల కామెంట్లు చేసిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ‘పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు వాగుతారా?’ అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ టాలెంట్ షో’లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అతడిపై పలు కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినుండి తనను విముక్తుడిని చేయాలని, వాటన్నింటినీ క్లబ్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రణవీర్. విచారణ సందర్బంగా అతని లాయర్‌పై పలు ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.