Home Page SliderTelangana

కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే ఐతే మనం ఏం కొన్లేం, తిన్లేం: ఈటల

కేసీఆర్ మన ఎమ్మెల్యే కావడం మన ఖర్మ. మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేసిండు. ఇళ్ళు కట్టిస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, పెన్షన్‌లు ఇస్తారు అనుకుంటే ఇవ్వకపోగా, ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చారు? మా ఊరు పచ్చని పొలాలతో ఉంటుంది, మా పొలాలు కూడా లాక్కుంటారట, పోకుండా చూడండి అని మైలారం గ్రామం వాళ్లు అడుగుతున్నారు. గజ్వేల్‌లో ఏ పనికి కూలిమనిషి కావాలన్నా ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఆటోలు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్న భూమి లాక్కోవడం వల్ల పది ఎకరాల ఆసామి కూడా అడ్డామీద కూలీలుగా మారారు. కేసీఆర్ ఎకరం భూమికి ఇచ్చిన డబ్బులతో ఐదు గుంటల భూమి కూడా రాలేదు. కేసీఆర్ మాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ, కడుపులో మట్టి కొట్టకు. తాగిపించి మైకంలో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. ప్రజలారా మీరు శక్తిని ఇవ్వండి కేసీఆర్ జేజెమ్మతో కొట్లాడతా. ఈటల రాజేందర్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాదు. మీ భూములు పోకుండా చూసుకుంటా మీకు అండగా ఉంటా. ముసలివాళ్లకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం.