హైదరాబాద్-దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ హెచ్చరిక!
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్-దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ఒక మెయిల్ సందేశంలో దుండగులు పేర్కొన్నారు.
శంషాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
కాసేపట్లో రన్ వే పైనుంచి బయలుదేరనుండగా ఆ విమానాన్ని నిలిపేసి ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పలిశీలించారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తరువాత తిరుపతి, వినోద్, రాకేష్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు దుబాయ్ మీదుగా ఇరాక్ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ పంపించనున్నట్లు తెలిపారు.