HYD: ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్‌లో పెట్టడానికి ట్రాన్స్‌జెండర్లు: CM-రేవంత్
TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్‌లో పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి, ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని తెలిపారు. ప్రజలు ఎక్కువ సేపు రోడ్లపై వెయిట్ చేయకుండా, తగు సదుపాయాల గురించి అన్వేషించాలని, ఆయా విషయాలపై పోలీసులు అవగాహనతో ముందడుగు వేయాలని చెప్పారు.