Home Page SliderInternational

ఏదేమైనా మా మద్దతు ఇజ్రాయెల్‌కే: అమెరికా ప్రెసిడెంట్

Share with

గతకొన్ని రోజులుగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ యుద్ధంలో ఎన్నో వందలమంది ప్రాణాలు కోల్పోయారు.పాలస్తీనా హమాస్  ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇజ్రాయెల్ సైనికులు,ప్రజలపై దాడులు చేసి వారిని హతమారుస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇజ్రాయెల్ –పాలస్తీనా మధ్య మారణకాండ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఏదేమైనా  ఇజ్రాయెల్ దేశానికే మా మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. కాగా తాను ఈ యుద్ధ పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడానని వెల్లడించారు. ఈ ఉగ్రదాడుల్లో నుంచి తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన హక్కు ఇజ్రాయెల్ దేశానికి ఉందని బైడన్ తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దేశానికి అమెరికా వెన్నుదన్నుగా ఉంటుందని బైడన్ హామీ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్న పాలస్తీనాకు ఇరాన్ దేశం మద్దతు ప్రకటించింది.