Home Page SliderNational

2023లో ఇండియన్స్ డబ్బు ఎలా ఖర్చు చేశారు? నివేదిక ఏం చెప్తుందంటే…!?

Share with

భారతీయుల ఖర్చు అలవాట్లను వెల్లడించిన Razorpay
ఖర్చు చెల్లింపుల వివరాలను వెల్లడించిన డేటా

ప్రముఖ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీ అయిన Razorpay వార్షిక చెల్లింపుల నివేదికను బహిర్గతం చేసింది. 2023లో భారతీయుల ఖర్చు అలవాట్లకు సంబంధించిన డేటాను వెల్లడించింది. నివేదిక తన ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 1, 2023- మార్చి 31, 2024 మధ్య నిర్వహించిన బిలియన్ లావాదేవీలను విశ్లేషించింది. భారతీయ వినియోగదారులు తమ డబ్బును ఖర్చు ఎలా చేస్తారో వివరించింది.

2023లో భారతదేశం తన డబ్బును ఎలా ఖర్చు చేసింది?
“వెల్త్, వెల్‌నెస్, వాండర్‌లస్ట్” పేరుతో Razorpay నివేదిక, 2024 ఆర్థిక సంవత్సరంలో పొదుపులు, పెట్టుబడులతో గణనీయమైన వృద్ధిని సాధించడంతో మరింత ఆర్థిక స్పృహతో కూడిన భారతదేశాన్ని చూపిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు 86% పెరిగాయి. నివేదిక ట్రేడింగ్‌లో పెరుగుతున్న ఆసక్తిని చూపిస్తుంది. ట్రేడింగ్ విలువలో 62% పెరుగుదల గ్రహించింది. బీమా చెల్లింపులు కూడా 56% పెరిగాయి. మల్టీప్లెక్స్ లావాదేవీలు గణనీయమైన 42% వృద్ధిని సాధించడంతో భారతీయులు ఎక్కువగా విశ్రాంతి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తేలింది. “జవాన్”, “బార్బీ”, “ఓపెన్‌హైమర్” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రజలు ఎక్కువగా వీక్షించారు.

హెల్త్, ట్రావెల్‌పై పెరుగుతున్న మక్కువ
టికెట్ ఏజెన్సీల విక్రయాల్లో 2.7 రెట్లు పెరుగుదల కన్పించింది. ఈ కాలంలో ప్రజలు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేశారు. విమాన ప్రయాణం కోసం చేసే ఖర్చులు 2.4 రెట్లు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2024లో ప్రయాణ వసతిపై ఖర్చు 29% పెరిగిందని నివేదికలో తేలింది. ఆరోగ్యంపై పెరుగుతున్న దృష్టిని కూడా నివేదిక చూపిస్తుంది. 2023లో డైటీషియన్లపై ఖర్చు 125% పెరిగింది. భారతీయులు పండుగల వేడుకలకు డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తున్నట్టు నివేదికలో Razorpay అభిప్రాయపడింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ల కోసం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గణనీయమైన పెరుగుదల నమోదైంది. రోజువారీగా చేసే ఆర్డర్లతో పోల్చుకుంటే రెట్టింపు ఆర్డర్లు రికార్డయ్యాయి. రెస్టారెంట్ డైన్-ఇన్‌లు 60% పెరిగడాన్ని గుర్తించింది.

రేటు పెరుగుతున్నా తగ్గని బంగారం క్రేజ్
ధంతేరాస్, దీపావళి రోజు ప్రజలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశారు. రోజువారీ సగటు కంటే 9 రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. Razorpay విశ్లేషణ నిర్దిష్ట రోజులలో ఆసక్తికరమైన ఖర్చు పోకడలను వెల్లడించింది. ఏప్రిల్ ఫూల్స్ డే ఊహించని విధంగా బుక్‌స్టోర్‌లలో బిజీగా మారింది. స్టోర్‌లో లావాదేవీలు రోజువారీ సగటు కంటే 3 రెట్లు ఎక్కువయ్యాయి. నవంబర్ 19న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ మధ్యాహ్నం 2 – 10 గంటల మధ్య క్యాబ్ చెల్లింపులు 28% పడిపోయాయి. కోట్లాది మంది అభిమానులు ఇళ్లలోనే ఉండి క్రికెట్ వీక్షించారు.