ఘోరం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
ఎన్ని చట్టాు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించిన దేశంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొందరు కామాంధులు కాటేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికను బంధించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. చివరకు విజయవాడలో బాలికను వదిలేయడంతో ఓ ఆటో డ్రైవర్ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి కూడా ఉన్నట్టు గుర్తించారు.