కూకట్‌పల్లి JNTU వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ కూకట్‌పల్లి JNTU వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెమిస్టర్ రిజల్ట్స్‌లో మార్పులపై విద్యార్ధులతో కలిసి NSUI నేతలు ఆందోళన చేపట్టారు. సెమిస్టర్ రిజల్ట్స్‌లో నుంచి క్రెడిట్ డిటెన్షెన్ ,గ్రేస్ మార్కులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ మేరకు అక్కడ నిరసన సెగలు వెల్లువెత్తాయి.

దీంతో JNTU వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు -NSUI నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థి నేతలపై లాఠీ ఛార్జ్ నిర్వహించారు. అంతేకాకుండా NSUI నేతలను బలవంతంగా పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారు. తమకు న్యాయం కావాలంటూ..విద్యార్ధులు ,విద్యార్ది సంఘాల నేతలు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్దులపై కూడా లాఠీ ఛార్జ్‌కు పాల్పడ్డారు.

