Home Page SliderTelangana

రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్‌రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.