Home Page SlidermoviesNationalNews Alert

‘హీరోయిన్లు అద్దం ముందు కూర్చోడానికే’- కంగనా ఘాటు విమర్శలు

Share with

ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీపై హిమాచల్ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరోక్షంగా మండిపడ్డారు. తాను నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఏ మాత్రం ప్రాధాన్యం లేదని ఆమె వాపోయారు. మొదట ‘పద్మావత్’ చిత్రంలో తనకు అవకాశం వచ్చిందని, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని తన పాత్ర ఏంటని అడిగితే.. ‘హీరోయిన్ అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంటే హీరో మైమరచిపోతాడు’ అని ఒక లైన్ మాత్రమే చెప్పారు. అందుకే తాను ఆచిత్రంలో నటించలేదని పేర్కొన్నారు. హీరోయిన్లకు కనీసం స్క్రిప్ట్ కూడా ఇవ్వరని మండిపడ్డారు. తనకు ‘పద్మావత్’ చిత్రం చూసినప్పుడు హీరోయిన్ సినిమా అంతా అద్దం ముందు కూర్చున్నట్లే కనిపించిందని పేర్కొన్నారు. తాను ఫేక్ ఐల్యాష్, బొటాక్స్ వంటి చికిత్సలు తీసుకోనని, అలాంటి వాటితో ఎక్కువ కాలం అందంగా కనిపించాలనుకునే హీరోయిన్‌ను కాదని, నటనకు ప్రాధాన్యం లేని చిత్రాలలో నటించడం అనవసరమని పేర్కొన్నారు.