‘అతడికి మరణశిక్ష వద్దు’..బాధితురాలి తల్లిదండ్రులు
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో దోషిగా నిరూపితమైన సంజయ్ రాయ్‌కు ఇటీవల ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అన్యాయమని, అతనికి మరణశిక్ష విధించాల్సిందే అంటూ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. దీనితో నేడు విచారణ మొదలయ్యింది. అయితే ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు దోషికి తాము మరణశిక్ష విధించాలని కోరడం లేదని న్యాయస్థానానికి విన్నవించినట్లు తెలియజేశారు. తమ కుమార్తె చనిపోయినందువల్ల, దోషిని కూడా చంపేయాలనేది తమ అభిమతం కాదని వారి కుటుంబం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

