పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని.. బాలుడి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది.
చంద్రుకొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది. పుస్తకాలను కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెండలపాడు గ్రామానికి చెందిన బాలుడు సుధీర్ బాబు (11) పుస్తకాల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన సుధీర్ బాబు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.