Home Page SliderNational

లియో సినిమాలో హీరోయిన్ ఫస్ట్ లుక్ చూశారా?

Share with

ఇళయ దళపతి విజయ్ హీరోగా తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో లియో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరో విజయ్‌కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలో త్రిషకు సంబంధించి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం లియో సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లోకేష్ కనగరాజన్,విజయ్ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.