Andhra PradeshNews

మునుగోడుకు ఉప ఎన్నిక రాదు: గుత్తా

Share with

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ వెళతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. మునుగోడులో ఉప ఎన్నిక వస్తోందని అందరూ అంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ను ఫైనల్‌ చేసినట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందించారు. రాజ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతుండోచ్చు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక రాక పోవచ్చని జోస్యం చెప్పారు. రాజగోపాల్ ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఏ కారణంతో రాజగోపాల్ రాజీనామా చేస్తున్నారని నిలదీశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ పొద్దున ఏం మాట్లాడతారో రాత్రి ఏం మాట్లాడతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.

మునుగోడులో రాజగోపాల్ పై పోటి గురించి నాతో ఎవరు మాట్లాడలేదని… సీఎం కేసీఆర్ నాతో మాట్లాడితే చెప్తానని గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు నేను మండలి చైర్మన్ పదవీలో సంతృప్తిగా ఉన్నానని… మంత్రి పదవి అనేది టైమ్ వచ్చినప్పుడు వస్తుందన్నారు. అవకాశం వచ్చినప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని గుత్తా తెలిపారు. సర్వేల్లో బీజేపీ పుంజుకున్నా …టీఆర్ఎస్‌దే అధికారం అని చెప్పాయని గుర్తుచేశారు. కేంద్రం పై సీఎం గట్టిగా మాట్లాడినా, అన్ పార్లమెంటరీ మాట్లాడబోరని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు ఎప్పుడో నిర్ణయించారన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు పార్టీలు మారడం కామన్ అన్నారు గుత్తా. ప్రకృతి విపత్తును ఎవరు ఏం చేయలేరని… అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా వరదలకు వణికాయని… కాళేశ్వరంలో కూడా అదే జరిగిందని స్పష్టం చేశారు. పోలవరం అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర, తెలంగాణపై కేంద్రానికి ప్రేమలేదని… కేంద్రం రాష్ట్రంపై కక్ష పూరితంగా ఓర్వలేని తనంతో వ్యవహరిస్తోందని… డీలిమిటేషన్ విభజన చట్టంలో ఉందని… కేంద్రం కావాలనే చేయడం లేదని మండిపడ్డారు.