Home Page SliderTelangana

హైదరాబాద్‌లో అట్టడుగుకి చేరిన భూగర్భజలాలు

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు  భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి,మాదాపూర్,గచ్చిబౌలి,బంజారాహిల్స్ ,అమీర్‌పేట,మల్కాజ్‌గిరి వంటి ప్రాంతాలలో బోర్లు అడుగంటిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏరియాలో జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో తరచూ నీటి కొరత ఏర్పడుతున్నట్లు GHMC అధికారులు తెలిపారు.  దీంతో  ఈ ప్రాంతాలలో ఉండే అపార్ట్‌మెంట్ వాసులు   నీటి ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. కాగా అవసరానికి తగ్గట్టుగా వాటర్ ట్యాంకర్లను పెంచాలని వారు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. మరోవైపు GHMC అధికారులు హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. నగరంలోని ప్రజలందరు నీటిని పొదుపుగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇది వేసవికాలం కావడంతో నీటిని మరింత జాగ్రత్తగా వినియోగించాలని హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.