రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం: ధూళిపాళ్ల
గుంటూరు: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గుంటూరులోని నీటిపారుదల శాఖ ఎస్పీఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడింటారు. పొన్నూరు మాజీ ఎమెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఎస్పీఈ కార్యాలయానికి వచ్చిన రైతులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. సరిపడా సాగునీరు ఇవ్వని కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వరి పంటను తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టిసీమ మోటార్లు పూర్తిస్థాయిలో ప్రారంభించి నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడవచ్చని తెలిపారు. అయితే చంద్రబాబుకు పేరొస్తుందనే కారణంతో అన్ని మోటార్లను ఆన్ చేయడం లేదని రైతులు విమర్శించారు.