ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ఈ ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సీఎస్ పేర్కొన్నారు.