సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్
సింగరేణి కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.అదేంటంటే కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించింది. దీని ప్రకారం సింగరేణిలో పనిచేస్తున్న ఒక్కో కార్మికుడికి రూ.1.53లక్షలు చెల్లించనుంది. అయితే ఈ ఏడాది బోనస్‌గా మొత్తం రూ.711.18 కోట్ల లాభాలను ప్రభుత్వం కార్మికులకు పంపిణీ చేయనుంది. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం సింగరేణి యాజమాన్యం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 16న సింగరేణి కార్మికుల అకౌంట్లలో దసరా కానుక జమ కానుంది. దీంతో సింగరేణి కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నెలలోనే సింగరేణి ఎన్నికలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ను కూడా సింగరేణి యాజమాన్యం విడుదల చేసింది.