Andhra PradeshHome Page Slider

వైఎస్‌ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Share with

వైఎస్‌ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.

ఎర్రగుంట్ల: వైఎస్‌ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్‌పీ నాగరాజు, తహశీల్దార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

 పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రొద్దుటూరు, కడపకు చెందిన 11 మంది.. ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో లారీని క్రాస్ చేయబోతుండగా.. ఎర్రగుంట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్‌తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతులను మహమ్మద్ (25), హసీనా (25), అమీనా (20), షాకీర్ (10)లుగా గుర్తించారు.