Home Page SliderNational

టీమిండియా కోచ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రవిడ్ సలహా..

టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయనకు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆడియో సందేశాన్ని పంపారు. దీనిలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి చక్కని సలహాను వివరించారు. “హలో గౌతమ్, నువ్వు కోచ్‌గా ఎంపికైనందుకు కంగ్రాట్యులేషన్స్. భారత క్రికెట్‌పై నువ్వు చాలా అంకితభావంతో ఉన్నావని అందరికీ తెలుసు. కష్టమైన సమయాలలో, ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకో. ఒత్తడి నుండి బయటపడే మార్గం మనసారా నవ్వడమే. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా కాస్త నవ్వుతూ ఉండు”. అంటూ ద్రవిడ్ సందేశం పంపారు. దీనిపై గంభీర్ స్పందిస్తూ, నేను ఎక్కువగా ఎమోషనల్ అవ్వను. కానీ ద్రవిడ్ భాయ్ మెసేజ్ విన్నాక, చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను అంటూ పేర్కొన్నారు.