ఆత్మహత్యాయత్నానికి యత్నించిన మహిళా నాయకురాలు
మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పని చేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకవడం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. అనంతరం కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. సీఎం వస్తేనే కిందికి దిగుతా.. లేకపోతే ఇంకా పైకి వెళ్లి దూకేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భారీగా పోలీసులు, అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.

