ఈటలపై కేసీఆర్ దుష్ప్రచారాన్ని… చూస్తూ ఊరుకోమన్న జమున
కేసీఆర్ పాలన మానేసి.. గారడి విద్యలు నేర్చుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్ సతీమణి జమున. ఈటల కుటుంబం ఆక్రమించుకునే వారు కారని… ఒక్క గుంట ఆక్రమించుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తామన్నారు జమున. ఈటెల రాజేందర్ ని బ్లెయిమ్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఒక్కడే రేపు వచ్చి మా 3ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలన్నారు జమున. తాము మాత్రం ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా వస్తామంటూ స్పష్టం చేశారు. ఆస్తులు అమ్మి అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొట్లాడుతామని తేల్చి చెప్పారు జమున.
ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది వచ్చారు పోయారన్నారు జమున. నిన్న పంపిణీ చేసిన భూముల్లో మాకు ఒక్క గుంట కూడా ఈటల కుటుంబానికి లేదన్నారు. నిన్న పంపిణీ చేసిన భూములతో ఈటల కుటుంబానికి సంబంధం లేదన్నారు. సర్వే నంబర్ 130/A లో మాకు 3ఎకరాల భూమి వుందన్నారు. నిన్న పంపిణీ చేసిన భూముల సర్వే నంబర్లు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. గేట్లు పగలగొట్టి మా భూమిలోకి వెళ్లి పట్టాలు పంపిణీ చేయడం దారుణమన్నారు జమున.
సీడ్ ప్లాంట్ 7ఎకరాల్లో ఉందని… సీడ్ ప్లాంట్ ఉన్న భూమికి పట్టా ఉందన్నారు. ఈటల భూములను కేసీఆర్ కబ్జా చేయాలని చూస్తున్నాడని జమున విమర్శించారు.
ఈటల పేద ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు.
ఈటల పేద ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు.
పేదల పొట్టగొట్టడం కేసీఆర్ కుటుంబ నైజమన్నారు.
రాజకీయంగా కొట్లాడితే పర్వాలేదని…. హుజురాబాద్ లో ప్రజలు తీర్పు ఇచ్చినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. మంచి చేయమని అధికారం ఇస్తే..కేసీఆర్ అన్యాయానికి పాల్పడుతున్నాడన్నారు. జమున హీచరిస్ కి ఎలాంటి పనులు,పర్మిషన్లు ఇవ్వొద్దని అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇచ్చారని…. ముఖ్యమంత్రి కావాలనే ఈటల కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకు… జమున హేచరిస్ భూములు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు జమున.పక్క భూములు పంపిణీ చేస్తూ జమున హీచరిస్ ముందు టెంట్ వేసి పట్టాలు పంపిణీ చేయడం దారుణమన్నారు.
జమున హేచరిస్ ముందు టెంట్ వేసి… అవి జమున హెచరిస్ భూములు అని నిమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే భూమి పట్టాలు మా స్థలం నుంచి ఇవ్వడానికి అదేమైనా కేసీఆర్ జాగీరా అని ప్రశ్నించారు జమున.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు కి మహిళల పాపం తగులుతుందని చెప్పారు. పిల్లలకు మందు తాపించి వెంట తిప్పుకుంటున్నాడని మహిళలు మొత్తుకుంటున్నారని జమున తెలిపారు.
ఈటలను రాజకీయంగా దెబ్బతీయలనే నిందలు వేస్తున్నరని… ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా కేసీఆర్ కు సిగ్గురాలేదన్నారు జమున.