బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ ప్రతాపం
వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. నేటి ఇంగ్లాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పసికూన బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది ఇంగ్లాండ్. కివీస్‌పై తొలిమ్యాచ్‌లో ఓడిపోయిన కోపాన్ని బంగ్లాదేశ్‌పై చూపించారు. టాస్ ఓడిపోయినా ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ లభించింది. దీనితో దూకుడుగా రన్స్ చేస్తూ తమ ప్రతాపం చూపించారు. 115 పరుగుల వరకూ వికెట్ పడకుండా ఆడింది. ఇంగ్లాండ్ ఆటగాడు సలాన్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సులతో 140 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసి, బంగ్లాకి భారీస్కోర్‌ను ముందు పెట్టింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు తీయగా, తస్కీం అహ్మద్, షకీబుల్ హాసన్ చెరో వికెట్ తీశారు.