Home Page SliderTelangana

పోలీస్ ఉద్యోగాలకు అర్హులైన అన్నదమ్ములు!!

Share with

కుమురంభీం జిల్లాలోని మూడు వేర్వేరు గ్రామాల్లో మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురేసి అన్నదమ్ములు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సోదరులు

చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్: కుమురంభీం జిల్లాలోని మూడు వేర్వేరు గ్రామాల్లో మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురేసి అన్నదమ్ములు పోలీస్ ఉద్యోగాలను సాధించారు. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన వెన్నంపల్లి శివలింగం- శంకరమ్మ దంపతుల ముగ్గురు కుమారులు ఉపేందర్ (సివిల్), మహేందర్ (సివిల్), విజయ్ (టీఎస్‌ఎస్‌పీ)లు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. పెంచికల్ పేట్ మండలం చేడ్వాయికి చెందిన మాధవ్-సునీత దంపతుల కుమారులు వెంకటేశ్(టీఎస్ఎస్పీ), కవలలైన రామ్ (ఏఆర్), లక్ష్మణ్ (టీఎస్ఎస్పీ)లు పోలీసు కొలువు సాధించారు. కౌటాల మండలం వీర్దండికి చెందిన అన్నదమ్ములు ఈర్ల వంశీకృష్ణ (టీఎస్ఎస్పీ), శివకృష్ణ (సివిల్), సాయికృష్ణ (ఏఆర్) కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.