మరో ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్స్
గతకొంతకాలంగా ఆప్ నేతలపై ఈడీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ తాజాగా మరో ఆప్ నేత ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. కాగా మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా ఉన్న సమయంలో అక్రమ నియామకాలు చేపట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ,ఏసీబీ ఆయనపై కేసులు నమోదు చేశాయి. ప్రస్తుతం ఈ కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.అయితే ఇప్పటికే పలువురు ఆప్ నేతలను ఢిల్లీ లిక్కర్ స్కామ్,మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా వారిలో ఎవరికి ఇప్పటివరకు బెయిల్ లభించకపోవడం గమనార్హం.