Home Page SliderTelangana

సమోసా 10, పులిహోర 30, బిర్యానీ 140.. రేట్స్ ఫిక్స్ చేసిన ఈసీ!

Share with

ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి చేసే ఖర్చులు… చూపించే వ్యాయానికి సంబంధించి అభ్యర్థులు చేసే ఫీట్లను చూసుకొని మనం నవ్వుకుంటూ ఉంటున్నాం. ఎన్నికల్లో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టే అభ్యర్థులు… చివరకు నిబంధనలను అనుసరించి వందలు, వేలల్లో చూపిస్తుంటారు. రూల్స్ ఎన్ని ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా చూపించడం అభ్యర్థులు మొదట్నుంచీ చేస్తున్న పనే. లేకుంటే ఎక్కడ.. ఏ ఇబ్బంది వస్తుందేమోనని వారి ఆందోళన.

ఐతే ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిబంధనలను, విధానాలను రూపొందించింది. ఇప్పటివరకు చేసే ఖర్చుకు విరుద్ధంగా సమర్పిస్తున్న అభ్యర్థులకు ఈసారి పక్క లెక్కలు చూపించాలనే… నిబంధనల చక్రాన్ని తెచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు పెట్టే ఖర్చులపై లెక్కలు పక్కాగా… ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాల కోసం చేసే ఖర్చులు అంటే… టీ, కాఫీ టిఫిన్, భోజనాల కోసం ఎంత అవుతుందో చెప్పాలని ఈసీ ఆదేశించింది. ఇకపై సభలు, సమావేశాలు నిర్వహించినా… అందుకు అయ్యే వ్యయం రికార్డులు సమర్పించాల్సిందే. సభలో ఏర్పాటు చేసే బెలూన్లు, ఎల్ఈడి స్క్రీన్లు ధర నిర్దేశించింది. ఒక్కో బెలూన్ కు 4000 రూపాయలు, ఎల్ఈడి స్క్రీన్ కు 15000 రోజువారి అద్దెగా ఈసీ లెక్కగట్టింది. ఇక ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తే 15000 అభ్యర్థి ఖర్చులో రాయాల్సిందే. సమావేశాలు నిర్వహించే సమయంలో వినియోగించే కుర్చీలు, టేబుళ్ల మొదలు… వెహికల్స్ రేట్ల రెంట్ నిర్దేశించింది. ఇక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే కళాకారులకు ఎంత మొత్తం చెల్లిస్తుందో కూడా చెప్పాల్సిందే! 2004తో పోలిస్తే ఇప్పుడు అభ్యర్థులకు ఈసీ కొంత వెసులుబాటు కల్పించింది. 2014లో ఎంపీ అభ్యర్థి ఎన్నికల వ్యయం…75 లక్షలు ఉండగా 2022 మొత్తాన్ని 90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని 28 లక్షల ఉండగా ప్రస్తుతం 40 లక్షలకు పెంచింది. పెరుగుతున్న ధరలు ఓటర్ల సంఖ్య లెక్కలోకి తీసుకొని పెంచింది.


ఈసీ నిర్దేశించిన ధరల మెను ఇలా…

రోజువారి వాహనానికి వెహికల్ కోసం చెల్లించాల్సిన మొత్తం మూడు వేలు. మినీ బస్సు కైతే మూడున్నర వేలు. ఇన్నోవా కారుకు నాలుగు వేలు. పెద్ద బస్సుకు ఆరు వేలు. బెలూన్ల కోసం నాలుగు వేలు. డ్రోన్ కెమెరాలకు ఐదు వేలు. ఇక ఫంక్షన్ హాల్ కు సంబంధించి పట్టణాల్లో ఐతే 15వేలు. గ్రామీణ ప్రాంతాల్లో 12 వేలు. ఎల్ఈడి స్క్రీన్ లకు 15 వేలు. ఇదే సమయంలో అభ్యర్థులకు అందించే స్నాక్స్ కోసం ధరలను సైతం ఈసీ నిర్దేశించింది. ఒక సమోసా పది రూపాయలు. వాటర్ బాటిల్ 20 రూపాయలు. పులిహోర ప్యాకెట్ 30 నుంచి 20 రూపాయలు. టిఫిన్ రేటు 35 నుంచి 30 రూపాయలు. ఇక భోజనం ఖర్చు 80 రూపాయలు. వెజిటబుల్ బిర్యాని 80 నుంచి 70 రూపాయలు. చికెన్ బిర్యాని 140 నుంచి 100 రూపాయలు. మధ్య మటన్ బిర్యానీకి 180 నుంచి 150 రూపాయలు.