చైనాలో కరువు తాండవం.. ప్రపంచ దేశాలపై ప్రభావం
ఆగస్టు 1వ తేదీ నుండి చైనాలోని చాలా ప్రాంతాలలో 45 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంటే అక్కడ ఎలా ఉంటుందో మీరే అర్ధం చేసుకోవచ్చు. ఈ కాలంలో పండించిన పంటను చైనాలో ఆహారం కోసం ఉపయోగిస్తారు. పరిస్థితి బాగుంటే.. మరో రెండు నెలల్లో వచ్చే పంట చైనీయులకు ఆహారం అందించనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే ధరలు మండిపోయాయి. అదే సమయంలో చైనాలో డిమాండ్ కూడా పెరిగింది. ధరలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగొచ్చు. ఈ ప్రభావం కచ్ఛితంగా గోధుమలు, బియ్యంలో కనిపిస్తుంది. ప్రపంచంలో బియ్యం మరియు గోధుమల ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది.

చైనా సంవత్సరానికి 211 మిలియన్ టన్నుల బియ్యం మరియు 133 టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు దేశంలో నెలకొన్న తీవ్ర కరువుతో ఈ ఉత్పత్తిపై భారీప్రభావం పడనుంది. ఇందులో చైనా దేశ ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మరిన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. చైనాలో కరువు వచ్చే అవకాశం ఉంది. అదిఆ దేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మన దేశం నుంచి చైనాకు గోధుమలు, బియ్యం ఎగుమతి పెరిగితే దేశ వ్యాప్తంగా ధర మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరియు చైనాలో పరిస్థితి గందరగోళంగా ఉంది. దేశంలో సగభాగం కరువుతో బాధపడుతుంటే, ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తర చైనా ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని, ప్రజలు మరింత ఒత్తిడికి గురవుతారని అధికారులు హెచ్చరించారు. ఒకవైపు అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వేడి గాలి.. మరోవైపు మరణాన్ని సూచించే వరద.. ఇంకోవైపు సమీపిస్తున్న మహమ్మారి.. ఇలాంటి కష్టాల నుంచి చైనా బయటపడడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

