‘అక్కడ కాషాయ వస్త్రాలు ధరించకండి’..ఇస్కాన్
కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్‌దాస్ బంగ్లాదేశ్‌లో హిందువులకు హెచ్చరికలు చేశారు. ఇస్కాన్ గురువులు, హిందువులు అక్కడ కాషాయ వస్త్రాలు ధరించవద్దని తెలిపారు. అక్కడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆలయాలు, ఇళ్లకే మన మతవిశ్వాసాలను పరిమితం చేసుకుందామని పిలుపునిచ్చారు. బయటకు వెళ్లినప్పుడు కాషాయవస్త్రాలు కనిపించకుండా కవర్ చేసుకోవాలని, బొట్టు కనిపించకుండా తల మీదుగా వస్త్రాన్ని వేసుకోవాలని సూచించారు. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ రామెన్ రాయ్‌పై మూకదాడి చేసిన నేపథ్యంలో ఈయన ఈ సూచనలు చేశారు. అతడు చేసిన తప్పల్లా చిన్మయ్ కోసం కోర్టులో న్యాయపోరాటం చేయడం నచ్చని మతోన్మాదులు ఆయన ఇల్లు ముట్టడించి దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో పోరాడుతున్నారు. సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధా రమణ్ దాస్ ట్వీట్ చేశారు.