Andhra PradeshHome Page Slider

సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దు: అంబటి రాంబాబు

Share with

నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఏపీ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు.

నకరికల్లు: నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఏపీ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన మంత్రి రాంబాబును రైతులు కలిసి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో ఆశించినమేర నీటి నిల్వలు లేవన్నారు. ప్రస్తుతం సాగర్ కాలువకు విడుదల చేస్తున్న 5 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. ఈ సంవత్సరం వర్షాధారమే తప్ప సాగర్ కాలువల కింద పంటలు వేసుకునే పరిస్థితి లేదన్నారు. నీరు మనం సృష్టించేది కాదని రైతులు చెప్పారు. దొరికితే కొనుక్కొని వచ్చి ఇవ్వటం సులవు కాదన్నారు.