హైదరాబాద్ ఈడీ డైరెక్టర్ గా దినేష్
హైదరాబాద్ జోన్ అదనపు డైరెక్టర్‌గా ఐఆర్‌ఎస్ అధికారి పరుచూరి దినేష్ నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీ పరిధితో కూడిన ఈడీ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్‌కు పరుచూరి నేతృత్వం వహిస్తారు. ఐఆర్‌ఎస్ 2009 బ్యాచ్ అయిన దినేష్.. గత నెల 31 న డిప్యూటేషన్‌పై ఈడీలో చేరారు. అంతకుముందు ఇన్‌కం ట్యాక్స్, ఏపీ ట్రాన్స్‌కో శాఖల్లో పని చేశారు. ప్రస్తుతంగా ఉన్న జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ముంబయి రెండో జోన్ జేడీగా బదిలీ అయ్యారు. పనాజీ, రాయ్‌పూర్ జోన్‌లకు కూడా గోయల్ ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తారు.