కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదాలు నిజమే: శశి థరూర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవలే అమెరికా, బ్రెజిల్ తదితర ఐదు దేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ దౌత్య కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి కేరళ రాజధానికి తిరిగివచ్చిన థరూర్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేనెక్కడికీ వెళ్లడం లేదు… నేను కాంగ్రెస్ వాదిని” అని ఆయన తేల్చిచెప్పారు.