బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సింగరేణి అధికారులు కూల్చివేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా చర్యలు తీసుకున్నారు. గోదావరిఖనిని స్మార్ట్ సిటీగా చేసేందుకు రోడ్ల వెడల్పు, ఆక్రమించి కట్టిన కట్టడాలను తొలగించి ప్రజలకు సౌకర్యంగా నిర్మాణాలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా కొంతకాలంగా పారిశ్రామిక ప్రాంతంలో ఇరుకుగా ఉన్న ప్రాంతాలను విస్తరించాలని కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ చేశారు.