Andhra PradeshHome Page Slider

పత్తి కాదిది.. పచ్చటి ఆకు పత్తి!

Share with

తణుకు: సాధారణంగా పత్తితో చేసిన వత్తిని దీపం ప్రమిదలో పెట్టి వెలిగిస్తాం. కానీ, ఓ పచ్చటి ఆకూ వత్తిలా చక్కగా వెలుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలికి చెందిన అడ్డగర్ల నాగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో వివిధ మొక్కలు పెంచుతున్నారు. అందులోని ఓ వైవిధ్యమైన మొక్కే మలబార్ కాట్మింట్. శాస్త్రీయ నామం అనిసోమెలెస్ మలబారికా. దీని ఆకులు వస్త్రాల్లా మృదువుగా ఉండటంతో పాటు నూనెను పీల్చుకుంటాయి. ఆకును వత్తిలా చేసి ప్రమిదలో పెట్టి, నూనె పోసి వెలిగిస్తే సాధారణ వత్తిలాగే కాంతులీనుతోంది. ఈ మొక్క విశిష్ఠతపై రామచంద్రపురం ప్రబుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు పాలకుర్తి షారా మాట్లాడుతూ ఈ పత్రాల్లో బాష్పీభవన తైలాలు ఉంటాయన్నారు. ఆకుల్లో ఔషధ గుణాలుండటంతో నొప్పుల నివారణకు వినియోగిస్తారని తెలిపారు.