Home Page SliderNational

అవినీతి కాంగ్రెస్ సహజ స్వభావం: అమిత్ షా

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కంపెనీల్లో భారీగా అక్రమ నగదు బయటపడినా ఆ పార్టీ సైలెంట్‌గా ఉండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అవినీతి కాంగ్రెస్ సహజ స్వభావమని విమర్శించారు. తమ అవినీతి రహస్యాలు ఎక్కడ బయటపడతాయనో ఇండియా కూటమిలోని జెడీయు, ఆర్‌జేడీ, డీఎంకే, ఎస్‌పీలు ఈ ఘటనపై స్పందించలేదు. దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ దుర్వినియోగం చేస్తున్నారని వాళ్లు ఎందుకు ప్రచారం చేశారో ఇప్పుడు అర్థమవుతోందని పేర్కొన్నారు.