ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దర్యాప్తు అధికారి మార్పు వెనుక కుట్ర: ధూళిపాళ్ల
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జయరామరాజును మార్చడం వెనుక కుట్ర ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.
మంగళగిరి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జయరామరాజును మార్చడం వెనుక కుట్ర ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా జయరామరాజు స్థానంలో డీఎస్పీ విజయభాస్కర్‌ను ఎందుకు నియమించారని ప్రశ్నించారు. ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజు ప్రభుత్వం మాటవినడం లేదా? విజయ్ భాస్కర్‌తో కేసును తాము అనుకున్నట్టుగా నడిపిద్దామనుకుంటున్నారా? కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వొద్దని చెప్పే ప్రభుత్వం.. ఇప్పుడు ఈ దశలో విచారణాధికారిని ఎలా మారుస్తారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారుల కుటుంబాలు కూడా కేసులు జరుగుతున్న తీరుపై ఆలోచన చేయాలి. ఇప్పుడు తప్పుడు విధానాలతో వెళ్తే.. భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అధికారంలోకి తామే రాబోతున్నాం. అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉంది అని ధూళిపాళ్ల క్రిటిసైజ్ చేశారు.