Home Page SliderTelangana

తెలంగాణలో బహిరంగ సభలు, రోడ్‌షోలకు కాంగ్రెస్ ప్లాన్స్

Share with

ఎలక్షన్ కమీషన్ తెలంగాణలో పోలింగ్ తేదీ ప్రకటించడంతో పార్టీల ప్రచార జోరు ఊపందుకుంది. తెలంగాణలో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలని యోచన చేస్తోంది. కలిసి వచ్చే పార్టీలతో కేసీఆర్‌ను ఎలాగైనా గద్దెదించాలనే ఉద్దేశంతో ఉంది. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 తేదీలోపు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా తెలంగాణ ఉద్యమకారులను పార్టీలో చేరుకునే ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్లే ఆలోచన చేస్తోంది. సర్వేల మీద సర్వేలు చేసి, అభ్యర్థులను ఖరారు చేసుకోబోతున్నారు. బస్సు యాత్రను జరిపి, కాంగ్రెస్ నాయకులలో అనైక్యత విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే వంటి అగ్రనేతలు తెలంగాణాకు రాబోతున్నారు. అక్టోబర్ 15 వ తేదీనుండి ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. వైఎస్ షర్మిల, కోదండరాం, లెఫ్ట్ పార్టీలను కాంగ్రెస్‌ కూటమిలో చేర్చుకునే ఉద్దేశంలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక వారికి సముచిత స్థానాలు కల్పిస్తామని ప్రమాణాలు చేస్తున్నారు.