పావు కిలో ఆలుగడ్డలు దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు
నా ఇంట్లో పావుకిలో ఆలుగడ్డలు దొంగిలించారని.. తాగిన మైకంలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వెతికిపెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్రమైన ఫిర్యాదుతో యూపీ పోలీసులు ఖంగు తిన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూపీలోని హర్డోయ్ పరిధిలోని మన్నాపూర్వాలో ఉంటున్న విజయ్ వర్మ అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇంట్లో ఉడకబెట్టి పొట్టు తీసిన పావు కిలో ఆలుగడ్డలను ఎవరో దొంగిలించారని డయల్ 112 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ వివేక్ కే. త్రిపాఠి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా పలువురు నెటిజన్లు దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలనీ కోరుతూ.. కామెంట్లు చేస్తున్నారు.