సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్‌ఫెక్షన్
హైదరాబాద్: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్‌కు ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అల్పాహార పథకం ప్రారంభ సందర్భంగా.. కేటీఆర్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. వైరల్ ఇన్‌ఫెక్షన్ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ మొదలైంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు అని తెలిపిన కేటీఆర్.