విశాఖ ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిన్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఏపీ మంత్రులు వైవీ సుబ్బారెడ్డి,విజదల రజిని,అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం మాట్లాడుతూ..డిసెంబర్‌లోగా తాను విశాఖకు షిప్ట్ అవుతున్నానన్నారు. ఇక నుంచి పరిపాలనా విభాగం అంతా ఇక్కిడికే వస్తుందన్నారు. విశాఖ నుంచే పాలన సాగుతుంది అన్నారు. దీంతో విశాఖ హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు తరహాలో ఐటీ హబ్‌గా మారబోతుందన్నారు. కాగా విశాఖలో 8 యూనివర్సిటీలు,4 మెడికల్ కాలేజీలు,14 ఇంజనీరింగ్,12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడించారు. అయితే ప్రతి ఏడాది 15 వేలమంది ఇంజనీర్లను విశాఖపట్టణం అందిస్తుందని సీఎం జగన్ తెలిపారు.