Home Page SliderTelangana

బీసీ నేతలతో సీఎం కీలక సమావేశం..

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ప్రజాభవన్ లో నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ భేటీ కీలకంగా నిలుస్తుందని నేతలు భావిస్తున్నారు.