InternationalNews

చైనాను కవ్విస్తున్న అమెరికా

Share with

నిప్పుతో ఆడుకునేవారు.. ఆ నిప్పుకే బలైపోతారంటూ… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను స్ట్రాంగ్‌గా హెచ్చరించారు చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్. రెండు గంటల పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జీ కీలక చర్చలు జరిపారు. వర్చువల్ సమ్మిట్ రెండు గంటలపాటు కొనసాగింది. తైవాన్‌ను కెలకడమంటే నిప్పుతో చెలగాటమేనంటూ అమెరికాను చైనా హెచ్చరించినట్టుగా… చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. “అగ్నితో ఆడుకునే వారు చివరికి కాలిపోతారు,” తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే ఇదే జరుగుతోందన్నారు. గత నవంబర్‌లోనూ అమెరికాకు చైనా ఇలాంటి వార్నింగే ఇచ్చింది.

మొత్తం పరిణామాలను అమెరికా అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు జీజిన్పింగ్. తైవాన్ విషయంలో చైనా ఫుల్ క్లారిటీగా ఉందని… చైనా జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలక్కుండా… 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటామని చెప్పారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక.. చైనా అధ్యక్షుడు జీ ఐదో రౌండ్ చర్చలు జరిపారు. తైవాన్‌పై వాణిజ్య వ్యవహారంలో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయ్. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అమెరికా అధికారులు తరచుగా తైవాన్ వస్తున్నప్పటికీ… పెలోసీ పర్యటనతో దుమారం రేగుతోంది. చైనా ఓవరాక్షన్ ఆపకుంటే… తైవాన్ మిలిటరీ జెట్స్ పంపిస్తామని… అమెరికా పౌరులను ఎలా కాపాడుకోవాలో తెలుసునంటూ పెంటగాన్ డ్రాగన్‌కు గట్టి హెచ్చరికలు పంపించింది.